![]() |
![]() |
.webp)
సూపర్ సింగర్ ఈ వారం షోలో లెజెండరీస్ పాడిన ఆ పాత మధురాలను పాడి వినిపించారు కంటెస్టెంట్స్. ఇక జడ్జెస్ ఆ సాంగ్ వెనక ఉన్న కొన్ని సందర్భాలను కంటెస్టెంట్స్ తో, ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఇళయరాజా గారు జానకి అమ్మ గురించి ఒక అద్భుతమైన కామెంట్ చేశారు. " ఎంత గొప్ప పాటలు చేశారు సర్... మీలాంటి వాళ్ళు పుట్టుండకపోతే మేము ఏమైపోయేవాళ్ళం" అని అన్నారట. "మీరు అది అంటున్నారు.
జానకి అమ్మ పుట్టి ఉండకపోతే నా పాటలు ఏమైపోయి ఉండేవో అని అనిపించింది నాకు..నా పాటకు జానకి కేవలం గాయని మాత్రమే కాదు ఇన్స్ట్రుమెంట్ ..ఒక వాయిద్యం లాంటిది..నేను ఏ స్వరాన్ని పలికించినా ఆ స్వరం ఆమె గొంతులోంచి పలుకుతూ ఉండేది. జానకి గారు పుట్టడం వల్లే నా పాటలు మీరింతమంది ఇంత మంచిగా వినగలుగుతున్నారు" అన్నారు. జానకి గారికి ఇళాయరాజా గారు ఇచ్చిన సర్టిఫికెట్..అంతకంటే రాజముద్ర ఇంకేదీ ఉండదు" అంటూ చెప్పారు అనంత శ్రీరామ్. తర్వాత సంగీత దర్శకుడు చక్రవర్తి గారి గురించి కూడా చెప్పారు.
సుమారు 965 వరకు సినిమాలు చేశారు. ఐతే ఒక్క ఏడాదిలో ఆయన 80 సినిమాలకు సంగీతాన్ని అందించి రికార్డు క్రియేట్ చేసారని చెప్పారు. తెల్లవారుజాము 3 గంటల వరకు మూడు నాలుగు థియేటర్స్ లో ఆయన వర్క్ జరుగుతూ ఉండేదట... ఆయన 3 గంటలకు వెళ్లి నిద్రపోయి మళ్ళీ 7 గంటలకు వచ్చేవారట. ఒక సారి బి.గోపాల్ సినిమాకు ఒక ట్యూన్ ఓకే కాకపొతే 56 ట్యూన్స్ చేసి ఇచ్చారని చెప్పారు. ఇక "యమహా నగరి" అనే పాటను వేటూరి గారు ఎంతో దివ్యదృష్టితో చూసి ఎవరూ రాయలేనంత అద్భుతంగా రాశారంటూ ఆ పాటలోని ప్రతీ పదం ప్రతీ వాక్యం గురించి వివరించారు. ఎవరైనా ఒక పాటతో పిహెచ్ డి చేయాలి అనుకుంటే ఈ పాటను తీసుకుంటే చాలు. కచ్చితంగా 400 పేజీల థీసిస్ రాయొచ్చు అని చెప్పారు శ్రీరామ్. వేటూరి గారు సుమారు 10 వేల పాటలు రాశారు. అలాంటి చరిత్ర ఈ దేశంలోనే కాదు ఈ లోకంలోనే లేదన్నారు.
![]() |
![]() |